నూతన విద్యా విదానం
★ విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంప్ కార్యాలయంలో
సమీక్ష నిర్వహించారు.
★ నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ
రూపొందించాలని, రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని,
దీని కోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు.
★
నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు జరుగుతుందని..
ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు విశేష ప్రయోజనం కలుగుతుందని సీఎం
అన్నారు.
★ ఉపాధ్యాయుల్లో, ఇతర భాగస్వాముల్లో అవగాహన, చైతన్యం కలిగించాలని,
నూతన విద్యా విధానంవల్ల జరిగే మేలును వారికి వివరించాలన్నారు.
★
మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్ కాలేజీలు ఉండాలని సీఎం స్పష్టం
చేశారు. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు-నేడు కింద భూమి కొనుగోలు, వచ్చే
ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్ దుస్తులు, షూ ఇచ్చే
అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే..
★ స్కూళ్లు,అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదు.
★ ఒక్క సెంటర్‌ను కూడా మూసివేయడం లేదు.
★ ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకునే మనం మార్పులు చేస్తున్నాం.
★ రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది మన లక్ష్యం.
★ పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒకటిగానూ ఉంటారు.
★ వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు వీరికి స్కూలు ఉంటుంది.
★
మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి10 వ తరగతి వరకూ సమీపంలోనే ఉన్న
హైస్కూల్‌పరిధిలోకి తీసుకురావాలి. ఆ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో
ఉండాలి.
★ ఉపాధ్యాయుడు, విద్యార్ధి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశం.
★నలుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలకు ఒకరే ఉపాధ్యాయుడు ఉండడం సరికాదు.
★ ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదు.
★ పౌండేషన్ కోర్సులో ఇది చాలా అవసరం
★ ఎందుకంటే 8 సంవత్సరాలలోపు పిల్లల మానసిక వికాసం చాలా అవసరం
★ 8 సంవత్సరాలలోపు పిల్లల్లో నూరుశాతం మెదడు అభివృద్ధి చెందుతుంది.
★ ఆ వయస్సులో వారిలో నైపుణ్యాలను మెరుగుపర్చాలి
★ ఈ వయస్సులో ఉన్న పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలి
★ 3 కిలోమీటర్ల లోపు హైస్కూల్ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం
ఎవరూ వేలెత్తి చూపేదిగా ఉండకూడదు
★ అలాగే ఒకేచోట ఎక్కువ క్లాస్ రూంలు పెట్టడం సరికాదు
★ ఎన్‌ఈపీ(నేషనల్ ఎడ్యుకేషన్ ప్లాన్) ప్రకారం.. నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పన మన లక్ష్యం.
★ ఆ మేరకు పిల్లలకు విద్య అందించేదిగా మన విద్యా విధానం ఉండాలి.
★ మనం చేస్తున్న పనులన్నీ కూడా తలెత్తుకుని చేస్తున్న పనులు. తలదించుకుని చేస్తున్న పనులు కావు.
★ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉపాధ్యాయులుకు మంచి జరుగుతుందని చెప్పండి
★ పిల్లలకు కూడా మంచి జరుగుతుందని వివరించండి.
★ నూతన విద్యావిధానంలో ఒక స్కూల్ మూతపడ్డం లేదు
★ ఒక్క ఉపాధ్యాయుడ్ని కూడా తీసేయడం లేదు.
★ అంతిమంగా అదే సందేశం పోవాలి
★ ఇంగ్లీషు మీడియంలో చెప్పాలని ఆరాటపడుతున్నాం
★ పిల్లలకు మంచి విద్య అందించాలని తపన పడుతున్నాం.. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
★ పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తున్నాం
★ ముందు తరాలకు మేలు జరిగేలా విద్యా వ్యవస్ధను తీర్చిదిద్దుతున్నాం. ఇదే విషయాన్ని చెప్పండి.
★ ప్రస్తుతం విద్యావ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నాం, గొప్ప కార్యక్రమం చేపడుతున్నాం, సానుకూల దృక్పథంతో పనిచేయండి.
★ నూతన విద్యావిధానంపై అందరిలో అవగాహన, చైతన్యం కలిగించండి.
★ ఎవరైనా సందేహాలు వ్యక్తంచేస్తే అధికారులు వారికి తగిన సమయం కేటాయించి వారి సందేహాలు తీర్చండి
★ ఉన్నతాధికారులు చిరునవ్వు, ఓపికతో వారికి కొత్త విద్యావిధానం లక్ష్యాలను, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి.
★ భాగ స్వాములైన టీచర్లను, ప్రజాప్రతినిధులను అందరినీ పరిగణలోకి తీసుకుని వారికి వివరాలు తెలియజేసి వారిలో అవగాహన కలిగించండి.
★
వచ్చే సమావేశానికల్లా ఈ నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు,
ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, అయ్యే ఖర్చుపై కార్యాచరణప్రణాళిక
తయారుచేయాలి.
★ రెండేళ్లలో ఈకార్యక్రమాలన్నీ పూర్తికావాలి
సమావేశంలో ప్రధానంగా నూతన విద్యా విధానం మీద ప్రభుత్వం తలపెట్టిన మార్పుల పైన చర్చ జరిగింది.
ఈ చర్చలో 49 ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి.
అన్ని సంఘాలు పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాల తో అనుసంధానం చేయటాన్ని స్వాగతించాయి.
అన్ని సంఘాలు ఉన్నత పాఠశాలలో +2ను తీసుకురావడాన్ని అంగీకరించాయి.
44 సంఘాలు 3, 4, 5 తరగతులు ప్రాథమిక పాఠశాల లోనే ఉండాలని చెప్పగా, రెండు సంఘాలు మాత్రం ఉన్నత పాఠశాలలో కలపడాన్ని సమర్థించాయి.
మిగిలిన సంఘాలు ఈ అంశంపై ప్రస్తావన చేయలేదు.
మాధ్యమం విషయమై దాదాపు 20 సంఘాలు ప్రాథమిక విద్య మాతృభాషా మాధ్యమంలోనే కొనసాగాలని ఉన్నత పాఠశాలలలో సమాంతరంగా రెండు మాధ్యమాలు కొనసాగాలని చెప్పాయి. మిగిలిన సంఘాలు మాధ్యమం ప్రస్తావన చేయలేదు.
400 లేదా 500 విద్యార్థుల సంఖ్య ఉన్న ఉన్నత పాఠశాలలో ప్లస్ టు ఏర్పాటు చేయాలని అత్యధిక సంఘాలు కోరాయి.
ప్రాథమిక పాఠశాలలలో ప్రధానోపాధ్యాయుల పోస్ట్ లు మంజూరు చేయాలని, 9 , 10 ,11 ,12 తరగతులలో పిజిటి పోస్టులు మంజూరు చేసి పదోన్నతులు కల్పించాలని, డీఎస్సీ ప్రకటించి, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సంఘాలు డిమాండ్ చేశాయి.
ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలన్నీ ఈ అంశాలపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు అందరూ అంగీకరించారని ,
అయితే 3, 4, 5 తరగతులను వేరు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారని,
దీనిపై ఆలోచన చేద్దామని అన్నారు .
ఇది ప్రారంభ సమావేశం అని ,తర్వాత తల్లిదండ్రులు, పాఠశాల కమిటీలు ,విద్యావేత్తలు, మేధావులు మరియు ఎమ్మెల్సీలు మొదలైన వారితో చర్చలు జరిపి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు ప్రస్తుతం విద్యాశాఖ దీనికి సంబంధించిన సమాచారాన్ని, గణాంకాలు మాత్రమే సేకరిస్తున్న సేకరిస్తున్నదని అన్నారు.
ఈ సమావేశపు అభిప్రాయాలను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తానని చెప్పారు.
ఈ రోజు 17/06/2021 మంత్రి గారితో జరిగిన సమావేశంలో మన వైఖరి, FAPTO వైఖరి సమర్థవంతంగా వినిపించాము. 1,2 సంఘాలు మినహా అన్ని సంఘాలు 3,4,5 తరగతులను హై స్కూల్స్ లో కలపడాన్ని వ్యతిరేకించాయి. ప్రభుత్వ వైఖరిలో మార్పు లేనట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలో 1,2 రోజుల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిద్దాము.
2. FAPTO నాయకత్వానికి, మనకు ఇచ్చిన మెమోలపై విద్యా శాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి లను కలిసాము. డైరెక్టర్ ఏకపక్ష ధోరణి, సంఘాల పట్ల ఆయన వైఖరి గురించి వివరంగా తెలియజేసాము. సీరియస్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలన్న రాజ్యాంగ లక్ష్యానికి, 2009 విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా ఈ విధానం ఉంది. 5వ తరగతి వరకూ చదివే పిల్లలకు స్కూలు ఒక కి.మీ. దూరం లోపు ఉండాలని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తోంది. కాని రాష్ట్ర ప్రభుత్వం 3వ తరగతి నుండే పిల్లలను దూరంగా ఉండే స్కూళ్ళకు పంపాలని ప్రతిపాదిస్తోంది.
మోడీ ప్రభుత్వం ఈ కరోనా సంక్షోభ కాలంలోనే తన హిందూత్వ ఎజెండాను వేగంగా, ఏక పక్షంగా దేశం మీద రుద్దుతోంది. అందులో భాగంగానే విద్యా విధానంలో తీవ్రమైన మార్పులను సూచిస్తూ ఏప్రిల్ లో రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. ఆ తర్వాత కేంద్ర విద్యామంత్రి నేరుగా రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జాబితాలో వున్న విద్యా రంగం మీద మోడీ పెత్తనం ఏమిటని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.
తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు ఈ నూతన విద్యావిధానాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేది లేదని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా దీని అమలుకు ఇంకా పూనుకోలేదు. కాని జగన్ ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనపడుతోంది. కేంద్ర విధానం ప్రకారం రానున్న విద్యా సంవత్సరం నుండే మార్పులు అమలు చేస్తామంటూ తన సర్క్యులర్‌లో సూచించింది.
విద్యా విధానంలో మార్పులు, చేర్పులు చేయాలంటే ఎంతో మేధోమథనం జరగాలి. విద్యా రంగ మేధావులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, స్కూలు కమిటీలతో చర్చించాలి. వారి సలహాలు తీసుకోవాలి. కాని అదేమీ లేకుండానే అమలుకు తొందర పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం.
ప్రాథమిక విద్యా వ్యవస్థపై దాడి
పాఠశాల పూర్వ విద్య (ప్రీ-ప్రైమరీ) ప్రవేశ పెడతా మంటూ ఆ పేరుతో ప్రాథమిక విద్యా వ్యవస్థను దెబ్బ తీయడం ఈ సర్క్యులర్ లోని ప్రధాన అంశం. ప్రాథమిక విద్యను రెండుగా విభజిస్తారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్ళకు, యు.పి స్కూళ్లకు తరలిస్తారు. 1, 2 తరగతుల పిల్లలను ఫౌండేషన్ స్కూళ్లలో పెడతారు. ఒకటవ తరగతి కన్నా ముందు రెండేళ్ళు పాఠశాల పూర్వ విద్య ఇక్కడ నేర్పుతారు. ప్రస్తుతం ఉన్న 34 వేల ప్రాథమిక పాఠశాలలు ఇక ముందు వుండవు.
ఊరి బడికి దూరం చేసి పిల్లలను మరో ఊరు నడిపిస్తారా ?
3, 4, 5 తరగతులు చదివే చిన్న పిల్లలు రోజూ 3 కి.మీ నుండి 6 కి.మీ దూరంలో వుండే హైస్కూలుకు నడిచి వెళ్లి రాలేరు. అక్కడక్కడా 8, 10 కిలో మీటర్ల దూరం ఉంది. గిరిజన గ్రామాలలో హైస్కూళ్ళు ఇంకా ఎక్కువ దూరమే ఉంటాయి. గతంలో 5వ తరగతి వరకు గ్రామాల్లో పెట్టింది విద్యను పిల్లలకు చేరువ చేయడానికే. ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేక దిశలో జగన్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలన్న రాజ్యాంగ లక్ష్యానికి, 2009 విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా ఈ విధానం ఉంది. 5 వ తరగతి వరకూ చదివే పిల్లలకు స్కూలు ఒక కి.మీ. దూరం లోపు ఉండాలని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తోంది. కాని రాష్ట్ర ప్రభుత్వం 3వ తరగతి నుండే పిల్లలను దూరంగా ఉండే స్కూళ్ళకు పంపాలని ప్రతిపాదిస్తోంది.
కార్పొరేట్ స్కూళ్ళకు పంపేస్తారు లేదా బడి మాన్పించేస్తారు
లేచిన దగ్గర నుండి పని చేస్తే తప్ప గడవని పేద జనం పిల్లలను రోజూ బడిలో దింపి తీసుకురాలేరు. వందల రూపాయలు ఇచ్చి ఆటో పెట్టుకోవాలి. డబ్బులు పెట్టలేని వారు బడి మాన్పించేస్తారు. ఇదే అదనుగా కార్పొరేట్ స్కూళ్లు గ్రామాలకు బస్సులు పంపి పిల్లలను తమ స్కూళ్ళకు పట్టుకుపోతాయి. దానివలన ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలు తగ్గితే వాటిని మూసేస్తారు. విద్యను ప్రైవేటుపరం చేసే లక్ష్యం దీని వెనుక కనిపిస్తోంది.
గిరిజన ప్రాంత అనుభవం ఏం చెప్తోంది ?
చంద్రబాబు ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో జివికె పాఠశాలలో చదువుతున్న 3, 4 తరగతులు చదువుతున్న పిల్లలను హాస్టళ్లు ఉన్న స్కూళ్లకు తరలించారు. తల్లిదండ్రులకు దూరమై పిల్లలు బడి మానేశారు. కొన్ని గ్రామాల్లో గిరిజన సంఘం, యుటిఎఫ్ కృషి వలన, తల్లిదండ్రుల వ్యతిరేకత వలన పిల్లలను తరలించలేకపోయారు. ఆ గ్రామాల్లో డ్రాపవుట్లు లేవు. ఇంత స్పష్టమైన అనుభవం వున్నా అదే తప్పు రాష్ట్రం అంతా చేయడమెందుకు ?.
తెలుగు మీడియం - టీచర్ పోస్టులు రద్దు
ప్రభుత్వ సర్క్యులర్‌లో రెండు హైస్కూళ్ల మధ్య దూరం 5 కి.మీ లోపు ఉన్నట్లైతే ఏ మీడియంలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే అదే మీడియం ఆ స్కూల్లో ఉంటుంది. రెండో మీడియం వారు పక్క స్కూలుకు పోవాలి. లేదా మీడియం మార్చుకోవాలి. ఈ షరతుతో తెలుగు మీడియం లేపేస్తారు. తెలుగులో బోధించే టీచర్లను ప్రస్తుతం సర్దుబాటు చేస్తారు. టీచర్ పోస్టులు మాత్రం శాశ్వతంగా రద్దు చేస్తా
మన తెలుగుకేమిటి ఈ అరిష్టం ?
ప్రతి జాతి తన భాషను ఇంగ్లీషు ముప్పు నుండి రక్షించుకొంటున్నది. మన తెలుగుకేమిటి ఈ అరిష్టం? ఒకవైపు హిందీ రుద్దేద్దామని బిజెపి ప్రయత్నిస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లీషు రుద్దేస్తున్నారు. రవీంద్రనాథ్ టాగూర్, గురజాడ, గాంధీ, నెహ్రూ అందరూ మాతృభాషలో చదువుకున్నారు. ఇంగ్లీషు నేర్చుకున్నారు. అంతే తప్ప ఇంగ్లీషు మీడియంలో చదువుకోలేదు. జగన్‌కు తెలియదా? లేక కార్పొరేట్ ప్రభావమా?
టీచర్ పోస్టుల కోసం ఎదురు చూసే యువతకు నిరాశే
డిఎస్‌సి కొన్నేళ్ళుగా రాజకీయ హామీ అయ్యింది. టీచర్ కావాలనే ఆశతో ఉన్న యువతను, వారి తల్లిదండ్రులను ఓట్లు కోసం మోసం చేసే పావు అయ్యింది. చంద్రబాబు ఊరించి ఊరించి చివరలో ఒకసారి డిఎస్‌సి వేశారు. జగన్ ప్రభుత్వం టెట్ పెట్టేస్తాం, డిఎస్‌సి వేసేస్తామని ప్రకటనల మీద ప్రకటనలే తప్ప చేయడం లేదు. ఫౌండేషన్ స్కూళ్ళలో టీచర్లతోనే గాక వాలంటీర్లుతో కూడా చదువు చెప్పించుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలకూ అప్పచెప్పవచ్చు. ఇక టీచరు పోస్టుల భర్తీ అవసరం ఏముంది? అందుకే జగన్ డిఎస్‌సి వేయడం లేదు.
బాధ్యత నుండి తప్పుకుంటున్న ప్రభుత్వం
1, 2 తరగతులను, ఐదేళ్ళ వయస్సున్న పిల్లలను కలిపి 18 వేల ఫౌండేషన్ స్కూళ్లు; మూడు, నాలుగేేళ్ళ పిల్లలను ప్రీప్రైమరీ - 1, 2గా విభజించి, 5 ఏళ్ళ పిల్లలనూ జోడించి 16 వేల పాఠశాలలు మరో కేటగిరీ; ఇందులో 16 వేల అంగన్‌వాడీ కేంద్రాలు కలిపేస్తారు. ఇవి గాక 3, 4 ఏళ్ళ పిల్లలను 31 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ - 1, 2 గా నడుపుతారు. ఈ మూడింటినీ ఏదో సొసైటీకి అప్పచెప్తారు. 34 వేల మంది టీచర్లను, 16 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలను సొసైటీలకు పంపేస్తారు. ఇప్పుడున్న 11 వేల హైస్కూళ్ళు మాత్రమే ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతాయి. దాదాపు 70 వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దవుతాయి.
పార్టీల సమస్య కాదు-ప్రజల సమస్య-కలిసి పోరాడాలి
మోడీ విద్యా విధానం వలన విద్యా బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకోవడం...3, 4, 5 తరగతుల పిల్లలను కిలోమీటర్ల దూరం నడిపించడం, తల్లిదండ్రులను వేధించడం, యువతకు టీచర్ అవకాశం లేకుండా చేయడం తప్ప ప్రయోజనం ఏముందో చెప్పండి? మోడీ మెప్పు కోసం రాష్ట్రం హక్కును వదిలేసి ప్రజలకు అన్యాయం చేయొద్దని, పిల్లలకు, యువతకు, తెలుగు భాషకు అన్యాయం చేయొద్దని రాష్ట్ర ప్రజలమంతా కలిసి పోరాడదాం. ఇది ప్రజల సమస్య. రాజకీయ అభిమానాలను పక్కన పెట్టి ఒక్కటిగా అందరూ ఉద్యమించాలి.
/వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /

No comments:
Post a Comment