Rule 33 APSSR 1996 Seniority in Telugu
పదోన్నతులలో
ఉద్యోగుల సీనియార్టీ లెక్కింపు కు సంబందించి రూల్ 33 గురించి తెలుగు లో
ఇక్కడ తెలుసుకుందాం. ఇది ఏ పి టీచర్స్ డాట్ఇన్ వారు ఇచ్చిన అనువాదం.
పబ్లిక్ సర్వీసు కమీషన్ / జిల్లా సెలక్షన్ కమిటీలు, ఎంప్లాయ్ మెంట్
ఎక్స్చేంజీలు, పదోన్నతులు, అర్హతగల క్రింది కేటగిరీలకు చెందిన ఉద్యోగుల
నుండి, ఇతర యూనిట్ల నుంచి, కారుణ్య నియామకాలు, ఇటీవలి కాలంలో మిగులు
సిబ్బంది సర్దుబాటు వంటి వివిధ పద్ధతులలో ప్రభుత్వం ఉద్యోగ నియా మకాలు,
ఖాళీలు భర్తీ చేయడం పరిపాటి. ఇందుకు మార్గదర్శకాలు ప్రభుత్వమే
రూపొందించినా, వాటి అమలు ఒకే సంస్థ లేదా అధికారి ద్వారా జరిగేవి కావు.
ప్రభుత్వ మార్గదర్శకాలను అర్థం చేసుకోవడంలో సందేహాలు, పాటించడంలో
లోటుపాట్లు జరుగుతుండటం మన మెరిగినదే. ఇవి సరిచేయించుకోవడానికి కోర్టుల
ద్వారా ఆదేశాలు పొందినవారున్నారు. నియామకపు తీరు ఏదైనా, కాలక్రమంలో ప్రతి
ఉద్యోగి పదోన్నతి ఆశించడం సహజమే. ఒక ఉద్యోగిని పదోన్నతికి పరిగణించడానికి
ప్రధానమైన ప్రాతిపదిక అతని సీనియారిటీ, అయితే, ఆయా సర్వీసులకు చెందిన
ప్రత్యేక నియమాల మేరకు, (సెలక్షన్ పోస్టులు) ప్రతిభ, సీనియారిటీ
ప్రాతిపదికనగాని లేక సీనియారిటీ నైపుణ్యం ప్రాతిపదికన గాని పదోన్నతులు
చేయాలి. ఇట్టి సందర్భాలలో, రహస్య నివేదికల ఆధారంగా నిర్ణయించిన ప్రతిభ
సమపాళ్ళలో ఉన్నప్పుడు, వారిలో సీనియరునే ముందుగా ఎంపిక చేయాలి. అందువల్ల
సర్వీసులో 'సీనియారిటీ' ప్రాధాన్యత కలిగిన అంశం.
