Rule 33 APSSR 1996 Seniority in Telugu
పదోన్నతులలో
ఉద్యోగుల సీనియార్టీ లెక్కింపు కు సంబందించి రూల్ 33 గురించి తెలుగు లో
ఇక్కడ తెలుసుకుందాం. ఇది ఏ పి టీచర్స్ డాట్ఇన్ వారు ఇచ్చిన అనువాదం.
పబ్లిక్ సర్వీసు కమీషన్ / జిల్లా సెలక్షన్ కమిటీలు, ఎంప్లాయ్ మెంట్
ఎక్స్చేంజీలు, పదోన్నతులు, అర్హతగల క్రింది కేటగిరీలకు చెందిన ఉద్యోగుల
నుండి, ఇతర యూనిట్ల నుంచి, కారుణ్య నియామకాలు, ఇటీవలి కాలంలో మిగులు
సిబ్బంది సర్దుబాటు వంటి వివిధ పద్ధతులలో ప్రభుత్వం ఉద్యోగ నియా మకాలు,
ఖాళీలు భర్తీ చేయడం పరిపాటి. ఇందుకు మార్గదర్శకాలు ప్రభుత్వమే
రూపొందించినా, వాటి అమలు ఒకే సంస్థ లేదా అధికారి ద్వారా జరిగేవి కావు.
ప్రభుత్వ మార్గదర్శకాలను అర్థం చేసుకోవడంలో సందేహాలు, పాటించడంలో
లోటుపాట్లు జరుగుతుండటం మన మెరిగినదే. ఇవి సరిచేయించుకోవడానికి కోర్టుల
ద్వారా ఆదేశాలు పొందినవారున్నారు. నియామకపు తీరు ఏదైనా, కాలక్రమంలో ప్రతి
ఉద్యోగి పదోన్నతి ఆశించడం సహజమే. ఒక ఉద్యోగిని పదోన్నతికి పరిగణించడానికి
ప్రధానమైన ప్రాతిపదిక అతని సీనియారిటీ, అయితే, ఆయా సర్వీసులకు చెందిన
ప్రత్యేక నియమాల మేరకు, (సెలక్షన్ పోస్టులు) ప్రతిభ, సీనియారిటీ
ప్రాతిపదికనగాని లేక సీనియారిటీ నైపుణ్యం ప్రాతిపదికన గాని పదోన్నతులు
చేయాలి. ఇట్టి సందర్భాలలో, రహస్య నివేదికల ఆధారంగా నిర్ణయించిన ప్రతిభ
సమపాళ్ళలో ఉన్నప్పుడు, వారిలో సీనియరునే ముందుగా ఎంపిక చేయాలి. అందువల్ల
సర్వీసులో 'సీనియారిటీ' ప్రాధాన్యత కలిగిన అంశం.
సీనియారిటీ ఎలా లెక్కించాలి
ప్రత్యక్ష
నియామకం చేయునపుడు పబ్లిక్ సర్వీసు కమీషనుగాని, జిల్లా సెలక్టు కమిటీగాని
మరి ఏ ఇతర సెలక్షన్ కమీషను/కమిటీగాని రిజర్వేషనులను దృష్టి యందుంచుకొని
ఎంపికైన ఉద్యోగుల జాబితా తయారుచేస్తుంది. ఆ జాబితాను సంబంధిత అధికారులు
ఆమోదించిన తర్వాత 'ఆమోదం పొందిన జాబితా'గా వ్యవహరిస్తారు.
నియామకాలు
'ఆమోదం పొందిన జాబితా'లోని వరుసక్రమంలోనే జరగాలి. తదనంతరం ఆ జాబితా ఆ
ఉద్యోగుల 'సీనియారిటీ జాబితా'గా పరిణామం చెందుతుంది. అనగా ఆమోదం పొందిన
జాబితా ప్రకారం నియామకమైన వుద్యో గుల సీనియారిటీ వారు డ్యూటీలో (గడువులోగా)
చేరిన తేదీతో నిమిత్తం లేకుండా ఆ జాబితా వరుసక్రమంలోనే
నిర్ధారింపబడుతుంది.
అయితే సర్వీస్ కమీషన్
ద్వారాగాని లేక మరొక సెలక్షన్ కమిటీ ద్వారాగాని ఎంపిక కాబడిన అభ్యర్థులు
వాళ్ళకు కేటాయించిన పదవులలో చేరక మరొక శాఖకుగాని లేక మరొక యూనిట్‌కుగాని
లేక మరొక బోనుగాని లేక మరొక జిల్లాకుగాని తిరిగి కేటాయింపు పొందిన ఉద్యోగి
“ఆమోదం పొందిన జాబితా'లోని ర్యాంకు కోల్పోయి క్రొత్త యూనిట్లో చివరి
అభ్యర్థి కన్నా జూనియర్ అవుతారు (జనరల్ రూల్-37).
ఇదే
విధంగా క్రింది పోస్టు నుండి. పై పోస్టుకు ప్రమోషన్ ఇచ్చుటకు జనరల్
రూల్-6లో తెల్సిన విధంగా పేనల్ తయారుచేసి సర్వీసు కమీషను పరిధిలోని పోస్టుల
గురించి సర్వీసు కమీషను మరియు స్క్రీనింగు కమిటీని సంప్రదించి సిఫారసు
పొందాలి. ఇతర పోస్టులకు డి.పి.సి. సిఫారసులు పొందాలి. ఆ పేనల్ ప్రకారమే
ప్రమో పనులు ఇవ్వాలి. సీనియారిటీ కూడా అదే వరుసక్రమంలో వుంటుంది.
ఒక
కేటగిరీలో ఐదు కన్నా ఎక్కువగా పదోన్నతి ద్వారా నింపదగు పోస్టులున్నప్పుడు,
అందులో షెడ్యూలు తెగలు/షెడ్యూలు కులాల ప్రాతినిధ్యం నియమాల మేరకు లేని
సందర్భాలలో సీనియారిటీ జాబితాలోని స్థానంతో నిమిత్తం లేకుండా ఆయా వర్గాలకు
చెందిన వారికి అవకాశం కల్పించాలి.
సీనియారిటీలెక్కింపుకు సంబంధించిన జనరల్ రూల్-33లో పొందుపరచబడిన నియమాలు:
(ఎ)
ఒక సర్వీసు, క్లాసు లేదా కేటగిరీ లేదా గ్రేడులో నియామకం తేదీ నుంచే
ఉద్యోగి సీనియారిటీ నిర్ధారింపబడుతుంది. ఒక శిక్షగా అతడు క్రింది పోస్టుకు
తగ్గించబడిన సందర్భాలలో ఇది వర్తించదు.
(బి) ఒక
సర్వీసుకు ఏకకాలంలో ఇద్దరి కన్నా ఎక్కువ వ్యక్తులను నియామకం చేయునప్పుడు
వారి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సు "నిర్దేశించాలి. ఇది నియామకాలలో రిజర్వేషన్లు
పాటించడానికి గాని, మరే ఇతర కారణం కోసమైనా కావచ్చు. ఆ విధంగా
నిర్దేశించబడిన ఆర్డరు ఆధారంగా వారి సీనియారిటీ గుర్తింపబడుతుంది. పబ్లిక్
సర్వీసు కమీషన్ లేదా ఇతర ఏజెన్నీ / అధికారుల ద్వారా ఎంపికైన వారి
సీనియారిటీ వారు ఎంపికైన లిస్టులో కమీషన్ నిర్దేశించిన ఆర్డరు ప్రకారం
ఉండాలి.
(సి) ప్రమోషన్ కు నోషనల్ గా ఒక తేదీ
నిర్ధారించినపుడు, ఫీడర్ కేటగిరీలో అర్హతగల సర్వీసు లెక్కించడానికి అట్టి
నోషనల్ తేదీనే ఆధారంగా తీసుకోవాలి. ఫీడర్ కేటగిరీలో ప్రొబేషన్ ప్రకటనకు
కూడా అట్టి నోషనల్ తేదీనే గణించాలి. .
(డి) ఒక
సర్వీసులో ఒక తరగతి లేదా కేటగిరీకి చెందిన వ్యక్తిని అదే సర్వీసులో సమానమైన
పే-స్కేలు గల ఇతర తరగతి లేదా కేటగిరీకి బదిలీ అయినప్పటికీ, ఆ వ్యక్తి
ముందు పోస్టులో రెగ్యులర్ నియామకం పొందిన తేదీ నుండియే సీనియారిటీ లెక్కింప
బడుతుంది. ఈ ఉప నియమం అనువర్తింపజేయడంలో నియా మకపు అధికారికి ఏదేని
ఇబ్బంది కలిగినపుడు ప్రభుత్వం, ఇతర సందర్భాలలో నియామకపు అధికారి కన్నా పై
స్థాయి అధికారి సీనియారిటీ నిర్ణయిస్తారు.
(a) విర్దేశిత కాలంపాటు ఒక ఉద్యోగి క్రింది పోస్టు, కేటగిరీ లేదా గ్రేడుకు తగ్గించబడినపుడు:
(i)
అతనికి శిక్షను నిర్దేశించిన ఉత్తర్వులలో వేరు విధంగా చెప్పని సందర్భాలలో,
ఆ శిక్ష అతని భవిష్యత్ ఇంక్రిమెంట్లు వాయిదా పడే ప్రభావం లేనపుడు, ఆతని
రీ-ప్రమోషన్ తర్వాత పనిష్మెంటు కన్నా ముందు అతడు ప్రమోషన్లో చేరిన తేదీ
నుంచే సీనియారిటీ వర్తిస్తుంది.
(it) ఉద్యోగిని శిక్షగా క్రింది
స్థాయికి పంపినపుడు, అతని భవిష్యత్ ఇంక్రిమెంటు వాయిదాపడే సందర్భాలలో అతని
రీ-ప్రమోషన్ తర్వాత ప్రమోషన్ పోస్టులో అతని పూర్వపు సర్వీసు ఆ మేరకు
తగ్గించి సీనియారిటీ లెక్కించాలి. (ఇ) (1)],
(ఎఫ్)
రిట్రెంచ్ లేదా రీ-అప్పాయింట్ అయిన వ్యక్తి సీనియారిటీ: ఏదేని కారణాన
రిట్రెంచ్ అయిన ఉద్యోగికి అతడు పునర్నియామకం పొందిన తేదీ నుండే సీనియారిటీ
లెక్కించబడు తుంది.
ఇటువంటి సందర్భాలలో పునర్నియామకం పొందిన వ్యక్తుల అంతర్గత సీనియారిటీ క్రింది విధంగా గణింపబడుతుంది.
(1)
పబ్లిక్ సర్వీస్ కమీషన్ లేదా ఇతర సెలెక్టింగ్ అథారిటీలతో సంప్రదించిన మీదట
జరిగే పునర్నియామకాలలో పబ్లిక్ సర్వీసు కమీషన్ లేదా సెలెక్టింగ్ ఆథారిటీ
నిర్దేశించిన మెరిట్ ఆర్డరు లేదా 1ప్రాధాన్యతా క్రమం ప్రకారం ఉంటుంది.
మరియు
(ii) ఇతర సందర్భాలలో, తొలగింపుకు ముందు ఆ వ్యక్తి
పునర్నియామకం కానున్న ఉద్యోగానికి సమమైన లేదా ఉన్నత సర్వీసు, తరగతి లేదా
కేటగిరీలో చేసిన సర్వీసు మొత్తం ఆధారంగా సీనియారిటీ పరిగణించాలి.
(జి)
ఏదేని సర్వీసు, తరగతి లేదా కేటగిరీలో చేరుటకు (ముందు మిలిటరీ సర్వీసు
చేసిన వారి విషయంలో, ఆయా సర్వీసు, తరగతి లేదా కేటగిరీలలో నియమాకానికి
ఉద్దేశించి తయారయిన అభ్యర్థుల అధికారిక లిస్టునందలి సూచించిన ప్రాధాన్యతా
క్రమము ప్రకారం సీనియారిటీ నిర్ణయించాలి.

No comments:
Post a Comment