child care leave -no age limit of child GO MS70 dt16/12/2025
G.O.Ms.No.70 (Finance Dept – Child Care Leave)
చైల్డ్ కేర్ లీవ్‌పై ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు
మహిళా ఉద్యోగులకు శుభవార్త
చైల్డ్ కేర్ లీవ్ (CCL) విషయంలో కీలక మార్పులు
,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ కేర్ లీవ్‌కు సంబంధించిన పిల్లల గరిష్ట వయస్సు పరిమితిని తొలగించింది.
ఈ ఉత్తర్వులు Finance (HR-IV-FR&LR) Department ద్వారా
G.O.Ms.No.70, తేదీ: 15-12-2025 న జారీ అయ్యాయి.
ఇకపై మహిళా ప్రభుత్వ ఉద్యోగులు తమ మొత్తం సేవాకాలంలో,రిటైర్మెంట్‌కు ముందు వరకు
చైల్డ్ కేర్ లీవ్‌ను వినియోగించుకోవచ్చు.
సింగిల్ పురుష ఉద్యోగులు
(అవివాహితులు / విధవులు / విడాకులు పొందిన వారు)
కూడా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.
పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా
⏩సాధారణ పిల్లలు
⏩వికలాంగ పిల్లలు (Differently Abled Children)
కోసం కూడా ఈ సెలవులు వర్తిస్తాయి.
మొత్తం 180 రోజులు (6 నెలలు)
గరిష్టంగా 10 విడతలుగా (Spells)
చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవచ్చు.
ఈ సెలవులు
⏩ పిల్లల సంరక్షణ
⏩ పరీక్షల సమయంలో
⏩అనారోగ్య సందర్భాల్లో
వినియోగించుకోవచ్చు.
ఇప్పటికి వాడిన విడతలు కాకుండా మిగిలిన సెలవులను 10 విడతలలో వాడుకోవచ్చును
ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.

No comments:
Post a Comment