11 th PRC పై మరొక కమిటీ G O M S 22 DT 1-4-2021
ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్
11వ పిఆర్ సి సాగదీతకు మరో కమిటి-యుటిఎఫ్
11వ పిఆర్ సి అమలుకు ప్రభుత్వం దాన్ని పరిశీలించుటకు మరో కమిటీ వేయడం సాగదీత కోసం మినహా ప్రభుత్వం ఉద్దేశ్యం ఇంకేమీ కాదని UTF రాష్ట్ర అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కె ఎస్ ఎస్ ప్రసాద్ లు ఒక ప్రకటనలో తెలియజేసారు.ఇప్పటికే పీఆర్సీ కమిటీ 5 సార్లు పొడిగింపు తర్వాత ప్రభుత్వానికి సమర్పిచారని, కమిటీ రిపోర్ట్ ను విడుదల చేయకుండా, మరొక కమిటీ వేయడం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల ను దెబ్బతీయడమేనని అన్నారు.11పిఆర్ సి లో పరిశీలనకు అర్హమైన అంశాలు ఏమున్నాయి?కమిటీ సిఫారసులు యిచ్చిన తరువాత ఏమి పరిశీలిస్తారు?.కమిటీల మీద కమిటీలు వేయడం పాలకులు పిఆర్ సి అమలు కాలయాపన కోసమే అనుకోవాలా?ఇప్పటికైనా 53% ఫిట్ మెంట్ తో 11 పిఆర్ సి వేంటనే ప్రకటించాలి.
1-7-2018 నుంచి మోనిటరీ బెనిఫిట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు
(ఎన్.వెంకటేశ్వర్లు)
అధ్యక్షులు
(కె.ఎస్.ఎస్.ప్రసాద్)
ప్రధానకార్యదర్శి

No comments:
Post a Comment